ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న COVID19 సంక్షోభం నేపథ్యంలో ఏదేశానికి ఆ దేశం తీవ్రంగా విల‌విల్లాడి పోతున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఎక్క‌డిక‌క్క‌డ విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇక మ‌న దేశంలో కూడా క‌రోనా ఎంత‌లా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త వారం ప‌ది రోజుల లెక్క‌లు చూస్తే స‌గ‌టున రోజుకు 10- 12 వేల కొత్త కేసులు దేశంలో న‌మోదు అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రిక‌వ‌రీ రేటు కూడా ఉన్నా కేసులు పెరుగుతుండ‌డం.. మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గానే ఉండ‌డంతో ఆందోళ‌న ఎక్కువ అవుతోంది.

 

ఇదిలా ఉంటే ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావాన్ని నిర్మూలించేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా సాధ్యం కావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే అత్యంత హానీ క‌ర‌మైన  ఈవైర‌స్‌ను ఎదుర్కొనేందుకు.... ప్రజలకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సామర్థ్యాలను పెంచడానికి ఫ్రాన్స్ మరియు భారతదేశం ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు దేశాలు 200 మిలియన్ యూరోలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: