ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మొదలయింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్ధులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఉన్నారు. టీడీపీ అభ్యర్ధిగా వర్ల రామయ్య ఉన్నారు. తొలి ముగ్గురు అభ్యర్దులకు అభ్యర్ధికి 38 ఓట్లు..నాలుగో అభ్యర్ధీకి 37 ఓట్లు కేటాయి౦చారు. 

 

తమ తమ పార్టీల ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన అధికార-ప్రతిపక్ష పార్టీలు కచ్చితంగా ఓటు వెయ్యాలి అని స్పష్టం చేసాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తోన్న ఎమ్మెల్యేలకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఇక ఎవరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఉండవద్దు అని సూచిస్తున్నారు. కాగా నాలుగు స్థానాలకు గానూ 141 ఓట్లను కేటాయించగా వైసీపీకి 151 బలం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: