దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరగడం పై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అసలే లాక్ డౌన్ లో జనాలు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ధరలు పెరగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా పెట్రోల్ ధరలు పెరగడంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. 

 

వరుసగా 13వ రోజూ పెట్రో ధరల పెంపును ఆయన ఖండించారు. గత 13 రోజులుగా నిత్యం రేట్లు పెంచి పెట్రోలు ధరను రూ.80 దాటించారని ఆరోపించారు.పెట్రోలుతో  డీజిల్ పోటీ పడుతోందన్నారు ఆయన. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలు 60%పైగా ఉన్నాయని... కరోనా కష్టకాలంలో సుంకాలు తగ్గించకపోగా ఇంకా భారం మోపుతారా అని నిలదీశారు. ధరల పెంపు కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వాలిచ్చే కరోనా కానుకేమో అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: