హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజు రొజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొన్న లెక్కల ప్రకారం గురువారం 302 మందికి కరోనా సోకింది. ఒక్క రోజే ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. బుధవారం 214 కేసులు వచ్చాయి. గురువారం 302 కేసులు వచ్చాయి అక్కడ. 

 

జూన్ నెలలో అక్కడ ఇప్పటి వరకు 2605 కేసులు వచ్చాయి. 8 వ తేదీ ఎన్ని కేసులు వచ్చాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. బర్త్ డే ఫంక్షన్లతో పాటుగా పెళ్లి వేడుకలు, అంత్యక్రియల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ఇక పోలీసులకు వైద్య విద్యార్ధులకు అక్కడ కరోనా ఎక్కువగా సోకుతుంది. దీనితో భారీగా పరిక్షలు నిర్వహిస్తుంది తెలంగాణా సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: