తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ శాఖల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసులు రైల్వే శాఖలో కూడా నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ కి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాసారు. 

 

రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కోవిడ్-19 వ్యాధి బారిన పడితే, వారిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు పంపకుండా, సికింద్రాబాద్‌ లాలగూడ సెంట్రల్ రైల్వే హాస్పిటల్ లో చికిత్స పొందటానికి అనుమతించాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసారు కిషన్ రెడ్డి. వారికి చికిత్స వేగంగా అందుతుందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: