ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసింది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కరోనా  కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

 

 ఈనెల 21 నుంచి 14 రోజులపాటు ఒంగోలులో పూర్తి స్థాయిలో లాక్ డౌన్  అమల్లో ఉంటుందని... ఎలాంటి సడలింపులు ఉండవు అంటూ కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు. జిల్లా కేంద్రం మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించినట్లు ఆయన  తెలిపారు. కాగా ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో 268 కరోనా కేసులు నమోదవగా జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే  28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమై కరోనా  వ్యాప్తిని నిరోధించడానికి  పూర్తిస్థాయి లాక్ డౌన్ విదిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: