టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ రాజ్యసభ అభ్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నేరచరిత్ర కలిగిన మోపిదేవి వెంకటరమణను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేశాడని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి రాజ్యసభ అభ్యర్థా...? అని ప్రశ్నించారు. మరో రాజ్యసభ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డిపై దేశంలో దాదాపు పది కేసులు నమోదయ్యాయని విమర్శలు చేశారు. పెద్దల సభకు ఈయనను జగన్ ఎంపిక చేశారని సీఎంను విమర్శించారు. 
 
జగన్ పరిమాల్ నత్వానీని ఏ విధంగా ఎంపిక చేశారో తనకు అర్థం కావడం లేదని... ఆయన ఏపీకి చెందిన వ్యక్తి కాదని... అంబానీకి చెందిన వ్యక్తి అని అన్నారు. తనకు ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదని అందువల్లే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. అంబేద్కర్ భావజాలాన్ని రాజ్యసభలో వినిపిస్తానని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: