భారత్-చైనా సరిహద్దు నెలకొన్న వివాదానికి సంబంధించి చర్చించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి నిర్ణయించారు విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలను అఖిలపక్ష సమావేశానికి పిలుపు పంపిస్తుంది కేంద్రం.  అయితే కేవలం ఐదుగురు ఎంపీలు ఉన్న పార్టీలను మాత్రమే అఖిలపక్ష సమావేశానికి పిలుస్తోంది. 

 


 కాగా ఈరోజు సాయంత్రం జరగబోయే అఖిలపక్ష సమావేశానికి టిడిపి పార్టీకి ఇంకా ఆహ్వానం అందలేదు. కారణం టీడీపీకి ఐదుగురు ఎంపీల సంఖ్య బలం లేకపోవడం. రెండు రోజుల క్రితమే టిడిపి ఎంపి సీతారామలక్ష్మి పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం టిడిపి పార్టీకి చెందిన ఎంపీల సంఖ్య నాలుగుకు పడిపోయింది. అయితే రెండు రోజుల క్రితమే టీడీపీ ఎంపీ పదవీకాలం ముగిసింది కాబట్టి  అఖిలపక్ష సమావేశానికి తమకు ఆహ్వానం అందుతుందని ఉహించింది టిడిపి. కానీ ఇప్పటికి  టిడిపి పార్టీకి మాత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపు అందలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: