ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. వైసీపీ ముగ్గురు అభ్యర్థులకు 38 ఓట్లు, నాలుగో అభ్యర్థికి 37 ఓట్లు కేటాయించింది. వైసీపీ తరపున ముఖ్యమంత్రి జగన్ తొలి ఓటును వినియోగించుకున్నారు. ఇదే సమయంలో వివిధ కారణాల వల్ల ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకొలేకపోయారు. ఈ.ఎస్.ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు ఓటు వేసేందుకు హాజరుకాలేదు. 
 
ఈసీ అనుమతి రాకపోవడం వల్లే ఆయన హాజరు కాలేదని టీడీపీ చెబుతోంది. మరోవైపు గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే ఆనగాని సత్యప్రసాద్ వ్యాపారరిత్యా తెలంగాణ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగరిరెడ్డిని కలిశానని ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండటం వల్ల ఓటింగ్ లో పాల్గొనలేకపోతున్నానని చంద్రబాబుకు లేఖ రాశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: