బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా సంచలనంగా మారిన విషయం తెలిసింది. కాగా సుశాంత్  ఆత్మహత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ స్నేహితులు  సన్నిహితులు బంధువులు అందరికీ విచారిస్తున్నారు. 

 


 ఇటీవలే సుశాంత్ స్నేహితుడు సునీల్ శెట్టి ని  విచారించిన పోలీసులు   సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ని కూడా ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా తొమ్మిది గంటలపాటు పోలీసులు రియా చక్రవర్తిని ప్రశ్నించారు. విచారణలో రియా చక్రవర్తి ఆసక్తికర విషయాలు చెప్పారు. సుశాంత్ ని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను  అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోనే సుశాంత్  ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసు విచారణలో తెలిపింది  సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: