చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మొదలయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది. వివిధ పార్టీల నేతలకు చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ పై ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇవ్వనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సిఎం లు పాల్గొంటున్నారు. 

 

అదే విధంగా విపక్షాల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సోనియా గాంధీ తో పాటుగా వామపక్షాల నేతలు కూడా హాజరవుతున్నారు. మొత్తం 20 పార్టీలకు ఆహ్వానం అందింది. బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాసేపట్లో ఏపీ సిఎం జగన్ తెలంగాణా సిఎం కేసీఆర్ పాల్గొంటారు. చైనా ఘర్షణ పై రక్షణ మంత్రి రాజనాథ్ వివరణ ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: