ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ఫలితం వచ్చింది. టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేయగా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్ధులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి విజయం సాధించారు. గెలిచిన ఒక్కో అభ్యర్ధికి 38 ఓట్లు వచ్చాయి అని ఎన్నికల సంఘం ప్రకటించింది. 

 

ఇక అది అలా ఉంటే టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నదీ వాస్తవానికి 23 మంది. అందులో ఇద్దరు ఓటింగ్ కి హాజరు కాలేదు. ఇక మిగిలిన నలుగురు ఓట్లు చెల్లలేదు. ఓటింగ్ కి ముందే శిక్షణ ఇచ్చినా సరే వారు ఎందుకు ఓటు సరిగా వేయలేదు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. టీడీపీలో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి నాలుగో ఎమ్మెల్యే ఓటు ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: