గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. డ్రాగన్ సైనికులు దొంగదెబ్బ తీసి అత్యంత దారుణంగా మన సైనికులపై దాడి చేసినట్లు తెలుస్తుంది.  ఇరవై మంది అమర వీరులకు దేశం మొత్తం సెల్యూట్ చేసింది.  తాజాగా సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతోపాటు నివాసస్థలం, సంతోష్‌ భార్యకు గ్రూప్‌ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తాను స్వయంగా సంతోష్‌బాబు ఇంటికి వెళ్లి సాయం అందిస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

IHG

మరోవైపు ఈ ఘర్షణలో మరణించిన 19 మంది సైనికుల కుటుంబసభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ. 10లక్షల చొప్పున రాష్ట్రప్రభుత్వం తరపున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామన్నారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని సైనికుల సంక్షేమానికి పాటుపడుతమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: