తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పొడిగించడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పదవీ విరమణ విషయంలో వివిధ రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అదే విధానం అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగా ఉంది. 
 
అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా రిటైర్మెంట్‌ వయసును 60 ఏళ్లకు పెంచడంతో సీఎం కేసీఆర్ పదవీ విరమణ వయస్సును పెంచే యోచనలో ఉన్నారని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్‌ అయితే సగటున రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. రిటైరైన ఉద్యోగులకు ఏడాదికి రూ. 3,500 కోట్లు చెల్లించాల్సి ఉండటం... కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ఉండటంతో ప్రభుత్వం పదవీ విరమణ వయస్సు పెంపు దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: