ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో పలు దేశాలు లాక్ డౌన్ పై ఆధారపడగా పలు దేశాలు లాక్ డౌన్ సడలింపులను అమలు చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ప్రమాదకర దశలోకి చేరుకుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అడన్హనమ్ మాట్లాడుతూ నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా లక్షన్నర కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. అమెరికా, దక్షిణాసియా దేశాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో భవిష్యత్తులో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: