దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వలస కార్మికులు చాలా మంది ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడిన సంగతి తెలిసిందే. మన దేశంలో దాదాపు 7 రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా అవస్థలు పడుతున్నారు. ఇక ఇప్పుడు కేంద్ర సర్కార్ వారిని ఆదుకోవడానికి గానూ  సిద్దమైంది. 

 

ఈ నేపధ్యంలోనే ఆరు రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికుల కోసం గరీబ్ కళ్యాణ్ రోజ్ గారి యోజన అనే పథకం  ప్రధాని నరేంద్ర మోడీ  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 25 ప్రాజెక్టుల్లో వలస కార్మికులను ఉపాధి కల్పిస్తుంది కేంద్రం. దీనికి ప్రత్యేక బడ్జెట్ ని కూడా కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: