ప్రధాని నరేంద్ర మోదీ నిన్న దేశంలోని ప్రధాన పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వచించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఈ సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ చైనా సైనిక దళాలు భారత్ భూభాగంలోకి చొరబడలేదని మోదీ చెప్పారని.... హింస జరిగిన ప్రాంతం చైనా భూభాగం అయితే భారత సైనికులు అక్కడ ఎందుకు చంపబడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చైనా దురాక్రమణకు లొంగిపోయారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

భారత సైనికులు ఎక్కడ చంపబడ్డారో కూడా చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సోమవారం రాత్రి గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను చైనా ఆర్మీ పొట్టనపెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ సమావేశంలో చైనా బలగాలు భారత్ భూభాగంలోకి చొరబడలేదని... ప్రతి అంగుళం భూమిని కాపాడుకునే సత్తా మనకు ఉందని.... దేశం మొత్తం మీతోనే ఉందని సైన్యానికి మాటిస్తున్నానని తెలిపారు. ప్రధాని మోదీ డ్రాగన్ బలగాలు మన దేశంలోకి చొరబడలేదని చెప్పడంతో రాహుల్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: