దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు పరీక్షలను కూడా వేగవంతంగా చేస్తూ వస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా పరిక్షల సంఖ్యను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కరోనా పరీక్షల్లో ఢిల్లీ సహా మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి. 

 

ఇప్పటి వరకు మన దేశంలో 66,16,496 నమూనాలను జూన్ 19 వరకు పరీక్షించారని ఐసి ఎం ఆర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,89,869 నమూనాలను పరీక్షించారని  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణా సహా ఏపీలో ప్రతీ రోజు కూడా భారీగా పరిక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడిలో పరిక్షలే కీలకంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: