ఇప్పుడు దేశంలో మద్యం విషయంలో  ప్రజల కష్టాలను తీర్చడానికి గానూ ఆన్లైన్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మద్యం అమ్మకాల్లోకి ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ కూడా అడుగు పెట్టింది. పశ్చిమ బెంగాల్ స్టేట్ బేవరేజెస్ శుక్రవారం విడుదల చేసిన ఒక నోటీసులో, మద్యం అమ్మకాల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హత ఉన్నట్లు గుర్తించిన సంస్థలలో అమెజాన్ కూడా ఉంది.

 

అలీబాబా మద్దతుగల భారతీయ కిరాణా వెంచర్ బిగ్‌బాస్కెట్ కూడా రాష్ట్రంలో మద్యం పంపిణీ చేయడానికి అనుమతి పొందింది. దేశంలో ఇప్పటి వరకు అమెజాన్ ఏ రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలు చేపట్టలేదు. ఇదే తొలిసారి కావడం విశేషం. పశ్చిమ బెంగాల్‌లో మద్యం పంపిణీ చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: