ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మం వాట్సాప్ గ‌త రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో వినియోగ‌దారుల‌కు తీవ్ర అసౌక‌ర్యాన్ని క‌లిగించింది. గ‌త రాత్రి 10.30 నుంచే ఈ అసౌక‌ర్యం ప్రారంభ‌మైంది. మ‌న‌దేశంతో పాటు యూఎస్‌, యూర‌ప్‌లోని ప‌లు దేశాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దేశాల్లోని చాలా మంది వినియోగ‌దారుల‌కు ఈ ఇబ్బంది క‌లిగింది. చాలా మంది వినియోగ‌దారులు వాట్సాప్‌ల‌లో త‌మ చివ‌రి సందేశాన్ని ఎప్పుడు చూశారో అక్క‌డ టైం క‌న‌ప‌డ‌డం లేదు.

 

అంటే త‌మ యూజ‌ర్లు చివ‌రి సందేశం ఎప్పుడు చూశారో ఇటు వైపు యూజ‌ర్ల‌కు తెలియ‌లేదు. మరికొందరు వారి భద్రతా సెట్టింగ్‌లను సర్దుబాటు చేయలేకపోయారు. ట్విట్టర్‌లో వినియోగదారుల ఫిర్యాదులపై వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించలేదు. దీనిపై ట్విట్ట‌ర్, ఫేస్‌బుక్ వేదిక‌గా ప‌లువురు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి కొంద‌రు వాట్సాప్ హ్యాక్ అయ్యింద‌న్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: