ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా నమోదు ఆతునే ఉన్నాయి. అమెరికా రష్యా భారత్ సహా పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది గాని తగ్గడం లేదు. 

 

ప్రపంచ వ్యాప్తంగా శనివారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 8,639,023 కాగా, మరణాలు 459,437 ఉన్నాయని అమెరికాలోని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్‌ఎస్‌ఇ) వెల్లడించింది. 

 

2,219,976 కేసులు మరియు 119,099 మరణాలతో, ప్రపంచంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 1,032,913 కేసులు మరియు 48,954 మరణాలతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో రష్యా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: