స్వలింగ సంపర్కుల విషయంలో తాజాగా ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. స్వలింగసంపర్కులు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని కానీ సహజీవనం మాత్రం చేసుకోవచ్చు అంటూ తీర్పునిచ్చింది. ఓ మహిళతో కలిసి ఉంటున్నందుకు తన కుటుంబ సభ్యులను నిర్బంధించారు అంటూ ఓ మహిళ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది ఉత్తరఖండ్ హైకోర్టులో. 

 

 అయితే దీనిపై విచారణ జరిపిన ఉత్తరాఖండ్ హైకోర్టు... ఓ మహిళను బంధించడం గృహహింస అవుతుంది అంటూ తెలిపింది. స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోరాదని కానీ కలిసి జీవించవచ్చు అంటూ జస్టిస్ శరత్ కుమార్ స్పష్టం చేశారు. ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న స్వలింగ సంపర్కులకు చట్టం రక్షణ కల్పిస్తుంది అంటూ ఆయన వెలువరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: