దేశంలో ఎన్నో ప్రసిద్ది పొందిన ఆలయాలు ఉన్నాయి.. అందులో ఒకటి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని  అన్ని చార్‌ధమ్‌ ఆలయం.  రేపు సూర్యగ్రహణం కారణంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని  అన్ని చార్‌ధమ్‌ ఆలయాలను (బద్రీనాథ్‌, కేదరీనాథ్‌, గంగోత్రి, యుమునోత్రి) శనివారం రాత్రి 10గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ఇప్పటికే పలు ప్రసిద్ద ఆలయాలు రేపు ముసివేస్తున్నట్లు తెలిపారు.  ఈ నేపథ్యంలో చార్‌ధమ్‌ ఆలయాలను (బద్రీనాథ్‌, కేదరీనాథ్‌, గంగోత్రి, యుమునోత్రి ) రేపు సూర్యగ్రహణం అయినప్పుటికీ సూతకం 12గంటల ముందుగానే వస్తుందని, ఇది రాత్రి 10గంటల 25నిమిషాల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 53నిమిషాల వరకు ఉంటుందని బద్రీనాథ్‌ ధామం అధ్యక్షుడు భువనచంద్ర యూనియల్‌ తెలిపారు.

 

కాగా, ఆదివారం 2గంటల తరువాత ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. దేశంలో లాక్ డౌన్ మొదలైన్పప్పటి నుంచి ఆలయాలు మూసినవేసిన విషయం తెలిసందే. ఈ ఏడాదిలో ఇదే మొదటి సూర్యగ్రహణమని, చంద్రుడు పూర్తిగా సూర్యుడిని కప్పేసి గరిష్ఠ గ్రహణ సమయంలో ఓ అగ్ని వలయం మాదిరి ఏర్పడుతుందని తెలిపారు.

 

1995 అక్టోబర్‌ 24న పూర్తిస్థాయి సూర్యగ్రహణం ఏర్పడిందని, మరోసారి అలాంటిదే ఆదివారం ఏర్పడనుందని ఆయన పేర్కొన్నారు. రేపు సూర్యుడు భూమధ్యరేఖకు, కర్కటరేఖకు మధ్యగా రానుండడంతో ఈ అద్భుతం ఆవిష్కృతమవనుందని బద్రీనాథ్‌ పూజారి భాస్కర్‌ దిమ్రి తెలిపారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: