దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధిహామీ పధకాన్ని నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్‌ వంటి పలు శాఖలకు అనుసంధానంచేయడం మామూలు విషయం కాదన్నారు తెలంగాణా పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రంలో ఏ సర్కార్ తీసుకొని విధంగా తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 

 

ఉపాధి హామీ పధకం కేవలం ఏదో ఒక గ్రామానికో, జిల్లాకో పరిమితం కాదన్నారు. దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో   కొనసాగుతున్న పథకం అన్నారు ఆయన. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దేవాదుల వంటి అనేక ప్రాజెక్టులను పెండింగ్‌లో పెడితే అలాంటి అనేక ప్రాజెక్టులను పూర్తిచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: