ప్రపంచంలో కరోనా రోజు రోజుకీ దారుణంగా విజృంభిస్తుంది. గురు-శుక్రవారం మధ్య 24 గంటల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా లక్షా 50 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.  ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దినికి వ్యాక్సిన్ కనుగొనలేదు.  వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, ఇటలీ, రష్యా ఈ మద్య భారత్ లోకూడా కేసులు బాగా పెరిగిపోతున్నాయి.

 

తాజాగా  కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో శనివారం కొత్తగా 7,889  మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్కరోజే 161 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య  8,002కు చేరింది.  దేశంలో ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,76,952కు పెరిగింది.  ప్రస్తుతం 2,34,358 మంది కరోనా రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: