తనకు నచ్చలేదు.. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో నడిరోడ్డుపై కూతురు, అల్లుడిపై వైసీపీ మంత్రి వనిత గన్ మెన్ చంద్రరావు వీరంగం సృష్టించాడు. ఐదు నెలల క్రితమే కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. అటుగా వెళ్తున్న కూతురిని చూసిన చంద్రరావు నడిరోడ్డు మీదే దాడి చేశాడు. మంత్రి దగ్గర పనిచేస్తే మాత్రం కుటుంబ సభ్యుల మీద రహదారులపై దాడులకు పాల్పడటం సమంజసం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  గాయత్రి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అయినప్పటికీ కనికరం లేకుంగా చంద్రారావు ప్రవర్తించాడు.

 

కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని చంద్రరావు అల్లుడిపై దాడికి తెగబడ్డాడు. ఎస్పీ ఆఫీసు దగ్గర్లో కూతురు, అల్లుడిని తరుముతూ చంద్రారావు దాడి చేశాడు. తండ్రే దాడికి పాల్పడడంతో గాయత్రి కాపాడాలంటూ కేకలు వేసింది. కూతురు వేడుకుంటున్నా చంద్రారావు వదిలిపెట్టలేదు.  స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వద్ద పనిచేసే గన్ మెన్ కూతురి మీద దాడి చేయడం సిగ్గుచేటని మండి పడుతున్నారు. ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన చంద్రరావుతో పాటు పలువురిపై ఏలూరు టూ టౌన్లో లో క్రిమినల్ కేసు నమోదు అయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: