కృష్ణా జిల్లాలో ఇసుక కొరత ఉంది అని వస్తున్న వార్తలపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు. ర్యాంపులకు 5 కి.మీ లోపు గ్రామాల ప్రజల అవసరాలకు ఎద్దుల బండిపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాం తంలోని గుర్తించిన 118 గ్రామాలకు ఈ అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. 

 

ఇసుక నిల్వ చేసినా, అమ్మినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతీరోజూ మూడు వేల కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇసుక కొరత విషయంలో ఏ మాత్రం కూడా విమర్శలు రావొద్దని అదే విధంగా ఇసుకను అక్రమంగా సరిహద్దు రాష్ట్రాలకు తరలిస్తే మాత్రం చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: