ఏదైనా హీరో కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారి అప్ లోడ్ అయ్యాయి అంటే అవి క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అదే ఎంతో క్రేజ్ వున్న యంగ్ రెబల్ స్టార్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కి వచ్చాయి అంటే ఇక అభిమానులకు పండగే. ఈ మధ్యకాలంలో హీరోలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఫోటోలు రావడం లేదు అన్న విషయం తెలిసిందే. 

 

 అయితే తాజాగా టాలీవుడ్ నిర్మాత బి.ఎ.రాజు హీరో ప్రభాస్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు అంటూ నిర్మాత బి.ఎ.రాజు కొన్ని ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం అభిమానులను ఈ ఫోటోలో తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో స్టైలిష్ లుక్ తో అదిరి పోయాడు అని చెప్పాలి. ఇక ఈ లుక్ ఏ  సినిమా కోసం అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: