టాలీవుడ్ లో మహేష్ బాబు... ఆయన తండ్రి కృష్ణ మధ్య అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేష్ ఏ స్థాయిలో ఉన్నా సరే కృష్ణ ను ఎప్పుడు కూడా ఏదోక సందర్భంలో తలుస్తూ తండ్రి మీద ఉన్న అభిమానం ప్రత్యేకంగా చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి మహేష్ విష్ చేసారు. 

 

‘‘నా తండ్రి గురించి నిర్వచించమని చెబితే ప్రేమ, దయ, కరుణ, బలమైన, ఇతరులపై చూపే జాగ్రత పదాలే నాకు గుర్తుకు వస్తాయని మహేష్ పేర్కొన్నారు. ఈరోజు నేనెంటో అవే ఆయ‌న నుండి వ‌చ్చిన‌దే అంటూ మహేష్ వ్యాఖ్యానించారు. ఆ ల‌క్ష‌ణాల‌తోనే ప్ర‌యాణిస్తున్నానని చెప్పారు. ఆయ‌న నాతో ఎలా ఉండేవారో నేను నా పిల్ల‌ల‌తో అలా ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నానని చెప్పారు. హ్య‌పీ ఫాద‌ర్స్ డే నాన్నా!. నా దారిలో మీరెప్పుడూ ముందుంటారని" మహేష్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: