ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ నాన్నలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా వైసీపీ నేత, సిఎం జగన్ సోదరి షర్మిల సోషల్ మీడియాలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి పోస్ట్ చేసారు. “నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. కూతురిగా నన్ను గుండెల్లో పెట్టుకొని పెంచారు. 

 

ఒక రాజకీయవేత్తగా పెద్ద బాధ్యతను మోస్తూ అన్నతో, నాతో నాన్న గడిపిన క్షణాలు తక్కువే అయినా జీవితానికి సరిపడా ప్రేమను మాలో నింపివెళ్లారు. నాన్న ఇచ్చిన స్ఫూర్తి, నమ్మకం మమ్మల్ని నడిపిస్తున్నాయి. ఎప్పటికీ నాన్నే నాకు రోల్ మోడల్. నాన్నను స్మరించుకుంటూ ఈ లోకంలోని నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అని ఆమె పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: