ఏపీ సర్కార్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్‌‌తో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల్లో అందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ పరీక్షకు చెల్లించిన ఫీజును వాపస్ చేస్తామని ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం వెల్లడించింది. పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ప్రభుత్వం ఈ పరీక్షల మార్కులను 100 మార్కులకు కుదించి గ్రేడ్లు ఇవ్వనుందని సమాచారం అందుతోంది. ప్రభుత్వం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రద్దుతో డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఉన్నత విద్యామండలి ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తులు ప్రారంభించిందని తెలుస్తోంది. సోమవారం అన్ని విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో ఉన్నత విద్యా మండలి అధికారులు ఈ విషయం గురించి భేటీ కానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: