అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ కరోనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగాను క్రమం తప్పకుండా అభ్యసించే వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో యోగాపై చేసిన ప్రచారం వైరస్ పై పోరులో బాగా ఉపయోగపడిందని అన్నారు. యోగా దినోత్సవానికి విశేషమైన స్పందన వస్తోందని వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రజలందరూ ఇంట్లో ఉంటూనే యోగా చేస్తున్నారని... బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తే 20 మంది కంటే ఎక్కువ మంది ఉండరాదని స్పష్టం చేశామని అన్నారు. యోగాతో మన శరీరంలో జరిగే వాటిని నియంత్రించవచ్చని... ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చని చెప్పారు. ఈ యోగా దినోత్సవం సందర్బంగా అందరూ ప్రతి రోజూ ఓ గంట పాటు యోగా చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: