ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసిన ఖగోళ అధ్భుత౦ సూర్యగ్రహణం వీడింది. దేశంలో తొలిసారి సూర్యగ్రహణం గుజరాత్ లోని ద్వారకలో కనపడింది. గ్రహణం వీడిన నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఆలయాలు అన్నీ కూడా తెరుచుకుంటున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం నుంచి బెజవాడ దుర్గమ్మ ఆలయం తెరుచుకోనుంది. 

 

నేడు కొన్ని రేపు కొన్ని ఆలయాలు తెరుచుకునే అవకాశం ఉంది. రేపటి నుంచి భక్తులను యధావిదిగా టీటీడీ అనుమతిస్తుంది. కాణిపాకం ఆలయం రేపు తెరుచుకుంటుంది అని అధికారులు వివరించారు. యాదాద్రి ఆలయం నేటి నుంచి తెరవనున్నారు. కాగా దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా సూర్య గ్రహణం వీక్షించారు ప్రజలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీక్షించారు భక్తులు. జాగ్రత్తలు తీసుకుంటూ ఖగోళ అద్భుతాన్ని వీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: