బాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ సహా కొందరు అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రముఖులు అందరిని కూడా అన్ ఫాలో చేస్తున్నారు. ఇక అగ్ర నటులను దారుణంగా ట్రోల్ చేసే పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో. 

 

తాజాగా ఈ ట్రోల్ తట్టుకోలేక సోనాక్షి సిన్హా ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ ఒక భావోద్వేగా పోస్ట్ చేసాడు. త‌న ఫ్యాన్స్ అంద‌రూ సుశాంత్ అభిమానుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని స‌ల్మాన్ పేర్కొన్నారు. సంద‌ర్భం, భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలని, ప్రేమించే వారిని కోల్పోతే ఎంత బాధగా ఉంటుంద‌ని స‌ల్మాన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: