ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తండ్రులతో ఉన్న జ్ఞాపకాలను నేమరవేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సిఎం వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ఆర్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నాన్నే తన బలమని, ప్రేరణనని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. 

 

ఆయన పోరాట స్ఫూర్తి, ప్రేమ, పిల్లల విజయాన్ని కాంక్షించే ఆయన మనస్తత్వం గొప్పవని జగన్ అన్నారు. ఆయనే తన తొలి మిత్రుడని, తన హీరో, తనకు స్ఫూర్తి ప్రదాత అంటూ జగన్ పేర్కొన్నారు. జీవితంలో విలువైన సందర్భాలను ఆయనతోనే పంచుకున్నానని చెప్పారు. గొప్ప తండ్రులు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: