దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో కీలకమైన మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి అక్కడ తీవ్రత పెరుగుతుంది గాని తగ్గడం లేదు. ఇక ఇదిలా ఉంటే అక్కడ ఇప్పటి వరకు కరోనా కేసులు లక్ష దాటాయి. 

 

లక్షా 50 వేల దిశగా వెళ్తున్నాయి. ప్రతీ రోజు కూడా మూడు వేలకు పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం 1,28,205  కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం కరోనా నుంచి 64,153 మంది కోలుకోగా  5984 మంది మరణించారని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పూణే లో నిన్న ఒక్క రోజే 900 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: