అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు. అది కరోనా వైరస్‌ కాదని ‘కుంగ్ ఫ్లూ’ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఒక్లహామాలోని టుల్సాలో శనివారం తొలి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనాను ఉద్దేశించి విమర్శలు చేసారు. 

 

చరిత్రలో మరే వ్యాధికీ లేనన్ని పేర్లు కోవిడ్-19కు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నేను దానిని ‘కుంగ్ ఫ్లూ’ అంటాను అంటూ వ్యాఖ్యానించారు. నేను దానికి 19 వేర్వేరు పేర్లు పెట్టగలనని... చాలా మంది దానిని వైరస్ అంటున్నారని... మరికొందరు ఫ్లూ అంటున్నారన్నారు. తేడా ఏంటి? నేనైతే 19, 20 రకాల పేర్లు ఉన్నాయని అనుకుంటున్నానంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: