సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యామిలీ ఏ స్థాయిలో యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. ఎప్పుడు కూడా ఏదోక ఫోటో మహేష్ నుంచి గాని ఆయన భార్య నమ్రత నుంచి గాని పిల్లల నుంచి గాని వస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి మహేష్ బాబు ఫ్యామిలీ ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

 

మహేష్ బాబు తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసారు. తన పిల్లలతో కలిసి బెడ్ రూమ్ లో ఆడుకునే ఫోటోలను మహేష్ బాబు పోస్ట్ చేసారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: