భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. ఇక సరిహద్దుల్లో చైనాతో యుద్ధం వచ్చే అవకాశం ఉంది అని పలువురు వ్యాఖ్యలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యుద్ద మేఘాలు సరిహద్దుల్లో అలముకున్నాయి అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు కూడా రాస్తున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికా నుంచి భారత్ యుద్ద సామాగ్రిని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది అని వ్యాఖ్యలు  వినపడుతున్నాయి. ట్రంప్ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. యుద్ద సామాగ్రిని కోరే అవకాశం ఉందని అలాగే యుద్ద విమానాలను కూడా అడిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అత్యాధునిక ఆయుధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: