భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ రష్యా రాజధాని మాస్కో వెళ్తున్నారు. ఆయన  మాస్కో పర్యటనకు వెళ్తున్న నేపధ్యంలో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో చైనా కూడా పాల్గొంటుంది. 

 

జూన్ 23 న రష్యా-ఇండియా- చైనా త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఆతిథ్యం ఇస్తున్నారు , జూన్ 24 న జరిగే విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం రష్యాకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో చైనా భారత్ విషయంలో రష్యా ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. 2017 లో డోక్లాం సంక్షోభం సమయంలో, బీజింగ్‌లోని రష్యా దౌత్యవేత్తలు చైనా ప్రభుత్వాన్ని నిలువరించారు. మరి ఇప్పుడు ఎం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: