కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 3 రోజుల పర్యటన కోసం మాస్కోకు బయలుదేరారు. తన రష్యా పర్యటన సందర్భంగా, భారతదేశం- రష్యా రక్షణ మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చలు జరుపుతారని కేంద్ర రక్షణ శాఖ కార్యాలయం వెల్లడించింది. 

 

మాస్కోలో జరిగే 75 వ విక్టరీ డే పరేడ్‌కు కూడా ఆయన హాజరుకానున్నారు. ఇక చైనా వ్యవహారాన్ని కూడా ఇప్పుడు రష్యాలో ఆయన చర్చించే అవకాశం ఉంది. రష్యా చైనా విదేశాంగ శాఖ మంత్రులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది అని సమాచారం. 2017 లో దోక్లాం విషయంలో రష్యా భారత్ కి సహకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారత్ చైనా విషయంలో రష్యా మీద ఆశలు పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: