కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్య శ్రీలో చేర్చాలి అంటూ తెలంగాణా బిజెపి డిమాండ్ చేస్తుంది. కోటీ హెల్త్ డైరెక్టర్  కార్యాలయం వద్ద బిజెపి నిరసనకు దిగింది. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బిజెపి సీనియర్ నేత లక్ష్మన్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి, రామచంద్ర రావు ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. 

 

తెలంగాణాలో కరోనా చికిత్సలు సరిగా చేయడం లేదని, పరిక్షలు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర సర్కార్ చేయడం లేదు అని బిజెపి ఆరోపణలు చేస్తుంది. ఇక ఎక్కడిక్కడ బిజెపి నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో కరోనా తీవ్రత ఉన్న నేపధ్యంలో నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం అయిందని బిజెపి ఆరోపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: