ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ శని ఆదివారాల మధ్యలో ఏకంగా లక్షా 80 వేల కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఒక్కరోజు ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. బ్రెజిల్, అమెరికా, భారత్ దేశాలలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్ లో అత్యధికంగా 54,771 కేసులు నమోదు కాగా అమెరికాలో 36,617 భారత్ లో 15,413 కేసులు నమోదయ్యాయి. 
 
నిపుణులు కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచడం, లాక్ డౌన్ సడలింపుల వల్లే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 87,00,008 కేసులు నమోదు కాగా 4,61,715 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. శని ఆదివారాల మధ్యలోనే 4,743 మంది మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: