తన కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలంటూ చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అనితారాణి దాఖలు చేసిన పిటిషన్ గురించి నేడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ, ఏపీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తాను లేవనెత్తిన అంశాలపై సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె హైకోర్టును కోరారు. 
 
చిత్తూరు జిల్లాలోని పెనుమూరు పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ అనితా రాణి తనను వైసీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదని... కేసును సీబీఐకి అప్పగించాలని ఈ నెల 15వ తేదీన ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్ ను విచారించిన కోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: