విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయ్యన్న ఈ కేసులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు పిటిషన్ పై విచారణ జరిపి అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అయ్యన్నకు కోర్టులో ఊరట కలిగింది. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదుతో పోలీసులు అయ్యన్నపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
అయ్యన్నపాత్రుడి తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం కార్యాలయంలోని మరో చోటుకు మార్చటంతో అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించి మున్సిపల్ కమిషనర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కృష్ణవేణి ఫిర్యాదు చేయగా అయ్యన్న తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: