ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. వర్సిటీ స్థాపనకు అవసరమైన భూమిని సేకరించాలని కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో రొయ్యలు, చేపల దిగుబడి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. చేపలు, రొయ్యల సాగులో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే దిగుబడి మరింతగా పెరిగే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. 
 
గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో అక్వా సాగు అధికంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శాస్త్రీయ విధానాలను అనుసరించే రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హేచరీస్‌ నిర్వహణ, ఎగుమతి వ్యాపారాల్లో కొనసాగుతున్నవారు ఎక్కువగా ఉండటంతో జగన్ జిల్లాలోని భీమవరంలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణ, ఇతర అధికారులను ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: