చైనా కంపెనీలకు భారత్ వరుస షాకులిస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలు చైనా ఉత్పత్తులు వాడబోమని ప్రకటించగా నెటిజన్లు చైనాకు చెందిన యాప్ లను స్మార్ట్ ఫోన్ల నుంచి తొలగిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర సర్కారు 5 వేల కోట్ల రూపాయలు విలువ జేసే ఒప్పందాలను నిలిపివేసి చైనాకు షాక్ ఇచ్చింది. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో చైనీస్ అంబాసిడర్ సున్ వీడాంగ్ తో మహారాష్ట్ర సర్కార్ ఈ నెల 15న మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. 
 
అయితే భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఒప్పందాలను పున:పరిశీలించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. పుణేలో ఆటో మొబైల్ ప్లాంటు ఏర్పాటు కోసం చేసుకున్న ఒప్పందం, ఫోటాన్ తో కలిసి పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ స్థాపించాలనుకోవటానికి చేసుకున్న ఒప్పందం, హెంగ్లీ ఇంజనీరింగ్ విస్తరణ కోసం చేసుకున్న ఒప్పందాలను మహా సర్కార్ రద్దు చేసుకోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: