పూరి జగన్నాథ్ రధయాత్రకు సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చింది. భక్తులు లేకుండా యాత్రను జరుపుకోవచ్చు అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. భక్తులు లేకుండా యాత్రను జరుపుతామని ఓడిశా సర్కార్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కి  నివేధించాయి. వందల ఏళ్ళు గా ఉన్న ఆచారాన్ని కరోనా దృష్టి లో పెట్టుకుని కొనసాగిస్తామని చెప్పాయి.

 

కరోనా తీవ్రత ను దృష్టి లో ఉంచుకుని యాత్రను నిర్వహిస్తామని స్పష్టం చేసాయి కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు. పలు నిబంధనలతో రధయాత్రకు సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చింది. పూరి యాత్రకు విదేశాల నుంచి కూడా హిందువులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కరోనా నేపధ్యంలో జరపాలా వద్దా అనే ఉత్కంట నేపధ్యంలో సుప్రీం కోర్ట్ ఈ తీర్పు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: