దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కంట్రోల్ త‌ప్పేసిన‌ట్టే ప‌రిస్థితులు చెపుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం ఆగ‌డం లేదు. నిమిషం నిమిషానికి అక్క‌డ కేసులు విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. తాజాగా సీఎం కేజ్రీవాల్ కేంద హోం శాఖా మంత్రి అమిత్ షాను క‌లిసిన కొద్ది సేప‌టికే కేసులు మ‌రింత‌గా పెర‌గ‌డంతో ఎవ్వ‌రూ ఏం చేసే ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌డం లేదు. గతంలో రోజుకు 5వేలు టెస్టులు చేసే ఢిల్లీ 18వేల టెస్టులు చేస్తున్నారు.

 

క‌రోనా సోకి హోం ఐసోలేష‌న్లో ఉన్న వారికి ప్ర‌తి ఐదు గంట‌ల‌కు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ చెక్ చేసుకునేందుకు పల్స్ ఆక్సిమీటర్లు సప్లై చేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో క‌రోనా అప్‌డేట్ చూస్తే 25వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 6వేల మంది హాస్పిటళ్లో ఉండగా 12వేల మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. దీనిని బ‌ట్టి ఢిల్లీలో క‌రోనా కేసులు పెరిగితే వారిని హాస్ప‌ట‌ల్స్‌లో చేర్చ‌డం కూడా క‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదే ప‌రిస్థితి మ‌రో వారం రోజులు కొన‌సాగితే ఢిల్లీని ఎవ్వ‌రూ కాపాడే ప‌రిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: