దేశంలో మార్చి నెల నుంచి కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కేసులు అంతంత మాత్రం పెరగడం మొదలయ్యాయి. ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసులు వందల్లో పెరగడం మొదలయ్యాయి. నిన్న  తెలంగాణ రాష్ట్రంలో కరోనా రక్కసి దూకుడు పెంచింది. ఏ రోజుకు ఆ రోజు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే 730 పాజిటివ్ కేసులను గుర్తించారు. 24 గంటల వ్యవధిలో 700కి పైగా కేసులు రావడం ఇదే ప్రథమం. ఇక ఏపిలో కూడా భారీ స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా రక్కసి వేగంగా వ్యాపిస్తోంది.

 

 

గత 24 గంటల వ్యవధిలో 443 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీటిలో 51 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారివిగా గుర్తించారు. తాజాగా 83 మంది డిశ్చార్జి కాగా, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,435కి పెరిగింది. ప్రస్తుతం 4,826 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  మొత్తమ్మీద ఏపీలో ఇప్పటివరకు 9,372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  కొత్తగా మరో 5 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 111కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: